నరేలాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రోడ్‌ షో

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ నరేలాలో రోడ్‌ షో నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆప్‌ అభ్యర్థులను గెలిపించాలని కేజ్రీవాల్‌ ప్రజలను కోరారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.