అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ‘భారత్‌లో మతస్వేచ్ఛ’ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ట్రంప్ పర్యటనకు కొన్ని రోజుల ముందే అమెరికాకు చెందిన ఓ సంస్థ ‘అంతర్జాతీయంగా మతస్వేచ్ఛ’ అనే అంశంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తర్వాత భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గ డం ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేసిం ది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌కు చెందిన సీనియర్ అధికారి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీ గురించి విలేకరులు ప్రస్తావించగా.. వాటిపై తాము కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ‘ట్రంప్ తన పర్యటనలో భాగంగా ప్రజాస్వామ్యం, మతస్వేచ్ఛపై అమెరికా విధానాలను వివరిస్తారు. ముఖ్యంగా మా ప్రభుత్వ ప్రాధాన్య అంశమైన మతస్వేచ్ఛ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తారు’ అని పేర్కొన్నారు.
మతస్వేచ్ఛపై మోదీతో చర్చిస్తాం