హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో.. భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ వల్ల సుమారు 120 బిలియన్ల డాలర్లు అంటే 9 లక్షల కోట్ల మేర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది జీడీపీలో 4 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కూడా వారు కోరుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఆర్బీఐ విధానసమీక్ష రిపోర్ట్‌ను వెల్లడించనున్నది. అప్పుడు భారీగా కోతలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్ వల్ల బ్రిటీష్ బ్రోకరేజ్ బార్క్‌లేస్ సంస్థ వృద్ధి రేటును సవరించింది. 3.5 శాతం నుంచి వృద్ధి రేటు 1.7 శాతానికి పడిపోనున్నట్లు చెప్పింది.