నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన కార్పోరేటర్‌..


కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత మూడు రోజులుగా ఇళ్లలో మగ్గుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, కాస్త ఉపశమనం కలిగించారు మాదాపూర్‌ కార్పోరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌. ఆయన సొంత ఖర్చులతో తన పరిధిలోని ప్రజలకు ఇంటింటికి తిరిగి సరుకులు పంపిణీ చేశారు. 5కిలోల బియ్యం, 3 కేజీల మంచినూనె, 2 కిలోల ఉల్లిగడ్డ, 2 కిలోల పప్పు, వారానికి సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. 


ప్రభుత్వం అందించే సరుకులను కూడా అందిస్తామని ఆయన ఈ సందర్భంగా కార్పోరేటర్‌.. ప్రజలకు తెలిపారు. కాగా, కార్పోరేటర్‌ సహృదయతకు వారు ధన్యవాదాలు తెలిపారు.