భారత్ నలుమూలల కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. కరోనా వైరస్ విజృంభించడంతో.. ప్రజలు గజగజ వణుకుతున్నారు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 24 గంటల్లో 1076 కొత్త కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 452కు చేరుకోగా, 1766 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.
భారత్‌లో 24 గంటల్లో 32 మంది మృతి